top of page

మా కథ...

ప్రపంచం మన గుప్పిట్లో అన్న చందాన సాగుతున్న ప్రస్తుత కాలంలో తెలుగు బోధనకు అవసరమయ్యే పలు వర్క్ షీట్స్ ను అటు విద్యార్థులకు ఇటు అధ్యాపకులకు అందజెయ్యాలన్న సదుద్దేశంతో మొదలు పెట్టిన బృహత్తర కార్యక్రమం ఇది.

 

ఇక్కడ ఇచ్చిన ఉపకరణాలన్నిటీనీ ఉచితంగా అంటే మీరు మీ అవసరాలకు తగ్గట్టుగా అంటే వాణిజ్య పరంగా లేదా లాభాపేక్షలేని పద్ధతుల్లో ఎలా అయినా సరే ఉపయోగించుకోవచ్చు.  పలు తెలుగు అధ్యాపకులకు ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (ఒఇఆర్) గురించి అవగాహన కల్పించి, వారిచే తెలుగులో రూపొందించబడిన వర్క్ షీట్స్ ను పాఠ్యాంశాల పై అవగాహన కల్పించే పలు అంశాలను ఈ వెబ్ సైట్ లో పొందు పరచడం మొదలు పెట్టాము. ఇది ఆరంభం మాత్రమే...త్వరలో మరిన్ని అంశాలను చేర్చడం జరుగుతుంది.

ఒఇఆర్ అంటే?

ఇక్కడ చదవండి...

ఇంటర్ నెట్ పై ఉండే / దొరికే వన్నీ ఉచితం కాదా?

కానే కాదు. ఏదైనా మనం వినియోగించుకోవాలంటే కాపీ రైటు హక్కులు చూసి ఉపయోగించుకోవాలి. సాధారణంగా సర్వ హక్కులు రచయితవే అనో లేదా కొన్ని హక్కులు రచయితవి అనో రాసి ఉంటాయి. వాటి పై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. ప్రపంచంలో ప్రస్తుతం పెద్ద పెద్ద విశ్వ విద్యాలయాలన్నీ ఓపెన్ టెక్స్ట్ బుక్స్ పై అవగాహన పెంచుకోండి అంటూ తాము కూడా వాటిని వినియోగించుకుంటూ పెద్ద మొత్తంలో ఆదాయ వనరులను  వృధా కాకుండా చేయగల్గామని అంటున్నాయి. అంతే కాదు విద్యార్థులు సైతం ఓపెన్ టెక్స్ట్ బుక్స్ వాడుకుంటూ ఇతర ఉచిత పాఠ్యాంశాల భాండాగారాలనుంచి తమకు కావల్సిన విషయ పరిజ్ఞానాన్నిపెంపొందించుకుంటున్నారు. తద్వారా ఎంతో పొదుపు చేయగల్గుతున్నాం అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఓపెన్ రిసోర్సెస్ భాండాగారాలు ఎన్నో ఉన్నాయి. ఇంటర్ నెట్ ద్వారా అవన్నీ ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో కూడా సైన్స్, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి కాలేజీ స్థాయిలో, పాఠశాల స్థాయిలో కొంతవరకూ అందుబాటులో ఉన్నాయి. అయితే తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించినవి తక్కువే అని చెప్పాలి. వాటి సంఖ్య ను పెంచే దిశగా వేస్తున్న తొలి అడుగులే ఈ వెబ్ సైట్.

ఓపెన్ లైసెన్సెస్ పై అవగాహన కల్పించే  డా. ఇందిర కోనేరు ప్రెజెంటేషన్:

bottom of page